Monday, January 20, 2025

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల పరిధిలో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్లు తెలిపింది.

న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి ఈశాన్యంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెర్మాడెక్ దీవుల సమీపంలో 49 కిలోమీటర్ల  లోతులో భూకంపం సంభవించిందని, భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని న్యూజిలాండ్ అధికారులు పేర్కొన్నారు. అయితే, భూకంపం ప్రభావంతో సునామి వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News