- Advertisement -
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి టోక్యోకు ఈశాన్యంలో 297 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించినట్లు జపాన్ మెటరలాజికల్ ఎజెన్సీ ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైనట్లు పేర్కొంది. భూకంపంతో నలుగురు మృతి చెందగా, సుమారు 97 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఫుకుషిమా తీరానికి 60 కిలోమీటర్ల (37 మైళ్ళు) లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని తెలిపారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంతవాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ భూకంపంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
7.3 Magnitude of Earthquake in Tokyo
- Advertisement -