Monday, December 23, 2024

జపాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

- Advertisement -
- Advertisement -

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన జపాన్ ను భూకంపం వణికించింది. సోమవారం జపాన్​ నార్త్​ సెంట్రల్​ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ ప్రకటించింది. భూ ప్రకంపనలతో జపాన్ పశ్చిమ తీరంలో భారీ అలలు తీర ప్రాంతాలను ఢీకొట్టినట్టాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంప ఘటనలో ఆస్థి, ప్రాణ నష్టాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది.. అయితే, పెద్ద ఎత్తున ఆస్థినష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News