- Advertisement -
జకర్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియా తూర్పు నుసా టెంగ్‌గెరా ప్రావిన్సులోని ఫ్లోరెస్ దీవిలో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు. దీని తీవ్రత రిక్టార్ స్కేల్ పై 7.6గా నమోదైనట్లు తెలిపారు. ఫ్లోరేస్ దీవికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఏర్పడినట్లు పేర్కొన్నారు. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా సమాచారం అందలేదని తెలిపారు.
7.6 Magnitude of Earthquake in Indonesia
- Advertisement -