Monday, December 23, 2024

ఇండోనేసియాలో పెను భూకంపం..

- Advertisement -
- Advertisement -

జకార్తా: ఇండోనేసియాలో మంగళవారం పెను భూకంపం సంభవించింది. సముద్రంలోతుల్లో రెక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో తూర్పు ఇండోనేసియాలోని తక్కువ జనసమ్మర్థపు దీవుల సముదాయం దెబ్బతింది. పలు భవనాలకు పగుళ్లు ఏర్పడటం, విధ్వంసం జరగడం వంటి వార్తలు నిర్థారణ అయ్యాయి. ఈ భూ ప్రకంపనల తీవ్రత ఉత్తర ఆస్ట్రేలియా వరకూ ప్రభావం చూపాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇండోనేసియాలోని టానింబర్ దీవులు, ఆగ్నేయ మలుకూ జిల్లాల్లో దాదాపు 124 ఇళ్లు దెబ్బతిన్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఒక్కరు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఉన్నట్లు వెల్లడికాలేదు. మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. పవూవా, ఈస్టు నూసా టెంగ్గారా ప్రాంతం దీనితో పాటు ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతం కూడా భూకంపానికి గురైంది.

తొలుత ఈ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు వెలువరించినా తరువాత వీటిని ఎత్తివేశారు. సముద్ర తీరం వద్ద అలలు ప్రమాదకర స్థితిలో లేనందున పరిస్థితిని విశ్లేషించుకుని సునామీ అలర్డ్‌ను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా ఉత్తర దిగువ భాగంలోని సముద్రంలో 105 కిలోమీటర్ల లోతున భూ కంప కేంద్రం నెలకొందని అమెరికాకు చెందిన భూగర్భ విశ్లేషక సంస్థ తెలిపింది. తనకు తెలిసినంత వరకూ ఇది చాలా ఎక్కువ సమయం ఉన్న భూకంపం అని ఆస్ట్రేలియా గాయని వాస్సీ ట్వీటు వెలువరించారు. ఇండోనేసియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండటంతో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో భూగర్భ అంతర్గత పరిణామాల ప్రాంతంలో ఇది ఉండటంతో భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తూ ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News