Saturday, December 21, 2024

దారుణ ఘటన.. లాడ్జీలో యువతిపై సామూహిక అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

లాడ్జీలో ఓ యువతిపై కొందరు దుండగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దరుణ సంఘటన కర్నాటక రాష్ట్రం హావేరి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యువతి ఆమె హ్నేహితుడు ఇద్దరు మాట్లాడుకునేందుకు హానగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీకి వెళ్లారు. ఈ సమయంలో ఏడుగురు వ్యక్తులు అతనిపై దాడి చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లాడ్జీలో సీసీ కెమెరాల ద్వారా నిందులను గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా.. యువతిపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News