Wednesday, January 15, 2025

ఎన్‌పిడిసిఎల్‌కు 7 అవార్డులు

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/ హైదరాబాద్ : ఐపిపిఎఐ (ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) 7 అవార్డులను వివిధ కేటగిరిల్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (టిఎస్‌ఎన్‌పిడిసిఎల్) దక్కించుకుంది. ఈ అవార్డులను ఈ నెల 9వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బెలగాంలో జరిగే 22వ రెగ్యులేటర్స్, పాలసీ మేకర్స్ రిట్రీట్ కార్యక్రమంలో అందజేయనున్నారు.

ఈ మేరకు గురువారం సంస్థ సిఎండి అన్నమనేని గోపాల్‌రావు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ దార్శనికత, ట్రాన్స్‌కో,జెన్కో సిఎండి డి.ప్రభాకర్‌రావు మార్గదర్శకత్వంలో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 24 గంటలు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. ఒక డిస్కంకు ఇన్ని అవార్డులు రావడం ఇదే మొదటిసారి అని అన్నారు. అవార్డులు రావడానికి కృషి చేసిన ఉద్యోగులందరికి ఆయన అభినందనలు తెలిపారు.

ప్రధానంగా 17 జిల్లాలోని 63 లక్షల వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోతలు లేకుండా అందించినందుకు, పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించినందుకు, విద్యుత్ ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, గ్రామీణ గృహ వినియోగదారులకు వెంటనే సర్వీస్‌లను మంజూరు చేసినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేశారు. సబ్‌స్టేషన్లల్లో నష్టాలను తగ్గించడం, సోలార్ పవర్‌ను కెవి లైన్లుకు అనుసంధానం చేయడం, స్పాట్ బిల్లింగ్ కోసం ఐఆర్‌ఎ మీటర్లను అమర్చడం, ఎస్‌ఎంఎస్ ద్వారా విద్యుత్ బిల్లుల సమాచారం పంపించినందుకు అవార్డులకు ఎంపిక చేశారని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News