Saturday, November 9, 2024

నేషనల్ పోలీస్ అకాడమీలో 7 కంప్యూటర్లు చోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపిఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో కంప్యూటర్లు మాయం అయ్యాయి. భద్రతా బలగాల కళ్లు గప్పి 7 కంప్యూటర్లను కేటుగాడు మాయం చేశాడు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపిఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి చాకచక్యంగా కంప్యూటర్లు దొంగలించడం కలకలం రేపుతోంది. కంప్యూటర్లు చోరీకి గురవ్వడంతో అధికారులు సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. సిసిటివి ఫుటేజ్‌లో దొంగతనం దృశ్యాలు రికార్టు అయ్యాయి. అకాడమీలో ఐటి సెక్షన్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి కంప్యూటర్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్‌పిఎ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపిఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లోని ఏడు కంప్యూటర్లు చోరీ అవ్వటంపై అధికారులు విచారణ చేపట్టారు. సిసిటివిలోని దృశ్యాలను పరిశీలించిన అధికారులు అకాడమీ ఐటి సెక్షన్ ఉద్యోగి చంద్రశేఖర్ కంప్యూటర్లను దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. చంద్రశేఖర్‌పై రాజేంద్రనగర్ పోలీసులకు ఎన్‌పిఎ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే కంప్యూటర్‌లోని డేటా కోసం చోరీ జరిగిందా? ఇంకేమైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పటిష్ట మైన భద్రత, సిసి కెమెరాలు ఉంటాయని తెలిసినా ఏడు కంప్యూటర్లు మాయం చేసిన చంద్రశేఖర్ ఈ చోరీకి పాల్పడడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News