Friday, November 22, 2024

కూలిన ప్రహారీ గోడ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజాంపేట్: అకాల వర్షం ఏ డుగురు కూలీల ప్రాణాలను బలిగొంది. మం గళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ప్రహారీ గోడ కూలి వారు నివాసముంటున్న షెడ్లపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నగర శివార్లలోని బాచుపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఇలా వున్నాయి….నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 18వ డివిజన్‌లోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న రైజ్ కన్‌స్ట్రక్షన్ భవన సముదాయంలో ఒరిస్సా, మహారాష్ట్రకు చెందినవారు కూలీలుగా పనిచేస్తున్నారు. నిర్మాణ సముదాయం పక్కనే కూలీలకు షెడ్‌లను నిర్మించి ఇవ్వడంతో వారు అక్కడే నివాసముంటున్నారు. దానిపక్కనే కన్‌స్ట్రక్షన్ యజమాని ప్రహారీ గోడను నిర్మిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రహారీ గోడ కూలి పక్కనే ఉన్న షెడ్లపై పడటంతో పెనుప్రమాదం జరిగింది.

షెడ్లలో నివాసముంటున్న శ్రీపతిమాజీ (20),బిందేష్‌చౌహాన్ (30),శంకర్ దేబ్‌గౌడ్ (17),బింద్రేష్ (30), గీతాబాయ్ (40) రామ్‌యాదవ్ (35), చిన్నారి కుషి (4)లు మృతి చెందారు. మరో ఎనిమిదికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో జరిగినా భారీవర్షం…కరెంట్ నిలిచిపోవడంతో అర్థరాత్రి వెలుగులోకి రాకపోవడంతో విశేషం. ఏడుగురు కూలీల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కూకట్‌పల్లి ఎసిపి శ్రీనివాస్‌రావు, బాచుపల్లి ఎస్‌హెచ్‌ఓ ఉపేందర్‌లు తెలిపారు. భారీ నిర్మాణం చేపట్టిన సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, కార్మికుల మృతికి కారణమైన భవన యాజమానిపై పలు సెక్షన్‌ల కింద కేసునమోదుచేసి దర్యాప్తుచేపడుతున్నట్లు వారు తెలిపారు.

మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని,పోస్టుమార్టం అనంతరం వారి స్వస్థలాలకు మృతదేహాలను తరలిస్తామని ఎసిపి తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలన్ శ్రీనివాస్‌రెడ్డి, బిజెపి నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని నిర్మాణ సంస్థ యాజమానిని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News