Wednesday, January 22, 2025

ఇరాన్ తీర ప్రాంతంలో 7 భూకంపాలు

- Advertisement -
- Advertisement -

7 earthquakes strike off Iranian coast

దుబాయ్, అబుదాబిలో స్వల్ప భూప్రకంపనలు

దుబాయ్: ఇరాన్‌కు దక్షిణాన కిష్ దీవికి సమీపాన సముద్ర గర్భంలో ఏడుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోగా వాటి ప్రభావం దుబాయ్‌తోపాటు ఇతర పెర్షియన్ సముద్ర తీర ప్రాంతమంతటా కనిపించాయి. వీటిలో నాలుగు ప్రకంపనల తీవ్రత 6గా నమోదుకాగా ఒక దాని తీవ్రత 5.3గా నమోదైనట్లు అమెరికా భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. భూకంపాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలేవీ ఇప్పటివరకు వెలుగుచూడనప్పటికీ హార్మోజ్‌గన్ ప్రావిన్సులోని జెన్నా పట్టణంలో సహాయక బృందాలను సిద్ధం చేసినట్లు ఇరానియన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 1,080 కిలోమీటర్ల దూరంలో జెన్నా పట్టణం ఉంది. దుబాయ్, అబుదాబిలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు యుఎఇ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News