Sunday, January 19, 2025

బాణాసంచా గోదాంలో అగ్నిప్రమాదం… ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు లోని కాంచీపురం జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీ గోదాంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం సమీపంలోని కురువిమలై గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఫ్యాక్టరీ యజమాని ఆన్సన్ ఎరయిల్ సోదరుడు డేవిస్ ఎరియిల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో సోదరుడు జాన్సన్ ఎరయిల్ 40 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాదాపు తొమ్మిది మంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. బాణాసంచా తయారీతోపాటు స్టోరేజి సౌలభ్యం ఉండే ఈ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి కారణాలేమిటో తెలియలేదని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కాంచీపురం కలెక్టర్ ఎం. ఆర్తి చెప్పారు.

పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా సంభవించిన పేలుడు ప్రకంపనలు దాదాపు 5 కిమీ దూరం వరకు ప్రభావం చూపాయని ఎనిమిదిళ్లు దెబ్బతిన్నాయని అక్కడివారు చెప్పారు. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగతో కమ్ముకుంది. ఫ్యాక్టరీ యజమాని ఆన్సన్ లైసెన్సు విలువను పోలీసులు పరీక్షిస్తున్నారు. తయారీకి ఉపయోగించే గన్‌పౌడర్‌ను నిల్వ చేసుకోడానికి ఎంతవరకు అనుమతి ఉందో పరిశీలిస్తున్నారు.

అయితే ఆ యూనిట్‌లో పేలుడు పదార్ధాలు నిల్వ చేసుకోడానికి అనుమతి లేదని కలెక్టర్ చెప్పారు. మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు ప్రమాద సమాచారం తమకు తెలియగా, వెంటనే వెళ్లి మంటలను ఆర్పడానికి ప్రయత్నించామని, సాయంత్రం 6.15 గంటలకు మంటలు అదుపు లోకి వచ్చాయని ఉత్తర పరవూర్ అగ్నిమాపక అధికారులు చెప్పారు. ఏడు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలు ఆర్పగలిగాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News