Sunday, December 22, 2024

ఆటలో ఓటమి పరాభవంతో ఏడుగురి ప్రాణాలు తీసిన ఘాతుకం..

- Advertisement -
- Advertisement -

బ్రెజిల్: ఆటలో వరుసగా ఎదురైన ఓటమితో నలుగురెదుట హేళనపాలైనానన్న పరాభవంతో క్షణికావేశంలో ఉన్మాదిగా మారిపోయి ఏడుగురిని కాల్చివేసిన భయంకర సంఘటన బ్రెజిల్ లో జరిగింది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. బ్రెజిల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరా, సహ నిందితుడి పేరు ఇజెక్వియాస్ సౌజ రిబెయిరోలు. వీరిద్దరూ ఈ ఘటన తరువాత ఓ కుగ్రామంలో తలదాచుకుని, అక్కడి నుంచి మరో చోటుకి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గత మంగళవారం సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో ఒలివిరా స్థానిక పూల్‌హాల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్ (బ్రెజిల్ కరెన్సీ)కు పందెం కాసి పూల్‌గేమ్‌లో ఓడి పోయాడు.

దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయి, కొంత సేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చాడు. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా ఓడిపోవడంతో పూల్‌హాల్‌లో ఉన్న కొందరు ఒలివిరాను చూసి నవ్వారు. దీంతో ఒలివిరా, ఎజిక్వియాస్ కోపోద్రిక్తులై ఈ దారుణానికి పాల్పడ్డారు. రెబిరో గన్‌తో బెదిరించి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టగా, ఒలివిరా వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఫూల్ యజమాని సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూప్రాణాలు కోల్పోయాడు. నిందితులు ఇద్దరూ డబ్బులతోపాటు అక్కడే ఉన్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News