Wednesday, January 22, 2025

తెలంగాణలో విషాదం నింపిన పతంగులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో గాలి పటాలు తీవ్ర విషాదం నింపాయి. సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో పతంగులు ఎగరవేస్తూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం హైదరాబాద్ మధురానగర్ లో మరో యువకుడు గాలి పటం ఎగరేస్తూ మృతి చెందాడు.

ఐదు అంతస్థుల భవనం పైకి స్నేహితులతో కలిసి గాలి పటం ఎగరవేయడానికి వెళ్లిన చౌహన్ దేవ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు.. ఆ భవనం పై నుంచి కిందపడి మరణించాడు. దీంతో చౌహన్ స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News