జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గు మందు మరణాల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంది. భారతదేశంలో తయారు చేయబడిన ఏడు దగ్గుమందులను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఓ నివేదిక ప్రకారం అనేక దేశాలలో దగ్గు సిరప్ కారణంగా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి.
ఆ తరువాత ఆరోగ్య సంస్థ ఈ చర్యకు పూనుకుంది. ఈ వ్యక్తులు దగ్గు సిరప్ తాగడం వల్లే చనిపోయారని డబ్లూహెచ్‌ఓ అభిప్రాయపడింది. గత కొన్ని నెలల్లో నైజీరియా, గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో దగ్గు సిరప్ తాగడం వల్ల అనేక మరణాలు నమోదయ్యాయి. డబ్లూహెచ్‌ఓ ప్రతినిధి ప్రకారం భారతదేశం, ఇండోనేషియాలోని ఫార్మా కంపెనీలు తయారు చేసిన 20 కంటే ఎక్కువ దగ్గు సిరప్‌లను పరీక్షించారు.
విచారణ తర్వాత డబ్లూహెచ్‌ఓ భారతదేశంలో తయారు చేయబడిన ఈ దగ్గు సిరప్ గురించి హెచ్చరికను కూడా జారీ చేసింది. గాంబియా, ఉజ్బెకిస్థాన్ మరణాల తర్వాత వివాదంలోకి వచ్చినవి ఈ దగ్గు సిరప్‌లు. దగ్గు సిరప్ తాగడం వల్ల 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.