Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో ఏడుగురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గోపాలపురం ఎస్‌హెచ్‌ఓ తవిటి నర్సింగ్ రావును చార్మినార్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. మల్టీ జోన్ 2లో ఉన్న పి.శ్రీకాంత్ రెడ్డిని గోపాలపురం ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.

డొంగరి శ్రీనివాస్‌రావును ఎస్‌బికి అటాచ్డ్ చేశారు. మారేడుపల్లి ఎస్‌హెచ్‌ఓగా వెంకటేష్‌ను, చాదర్‌ఘాట్ ఇన్స్‌స్పెక్టర్‌గా సంద్యాల సైదులు, గోపాలపురం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా వెంకటరాములు, చాదర్‌ఘాట్ ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ రెడ్డిని జోన్‌కు సరెండర్ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే రిలీవ్ అయి వారికి కేటాయించిన స్థానాల్లో చేరాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News