Saturday, December 21, 2024

రాష్ట్రంలో ఏడుగురు ఐపిఎస్‌ల బదిలీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఏడుగురు ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు ఇస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వలు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్. రంగారెడ్డిని పిసిఎస్ అండ్ ఎస్‌ఎస్పీగా నియమించారు. గ్రేహౌండ్స్‌లో ఎఎస్పీగా ఉన్న యోగేశ్‌గౌతంకు సైబరాబాద్ అడ్మిన్ డిసిపిగా పోస్టింగ్ ఇచ్చారు. ఆర్. వెంకటేశ్వర్లును సిఐడి విభాగంలో ఎస్‌పిగా నియమించారు. జే.రాఘవేందర్‌రెడ్డిని రైల్వేస్‌లో అడ్మిన్‌ఎస్పీగా నియమించారు.

ఇంతకు ముందు నాన్ కేడర్ ఎస్పీ పూజను టిఎస్‌పిఎ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆమె ఇంతకు ముందు పనిచేసిన వరంగల్ పోలీస్ ట్రైనింగ్ పోస్టులోనే కొనసాగుతారని పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సతీష్‌ను డిజిపి కార్యాలయంలో లీగల్ ఎస్పీగా నియమించారు. మురళీధర్‌కు వరంగల్ క్రైమ్స్ డిసిపిగా పోస్టింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News