Monday, January 20, 2025

ఘోర ప్రమాదం.. ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి

- Advertisement -
- Advertisement -

ఘోర ప్రమాదం
నదీలోయలోపడిన బస్సు…
ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు ఐటిబిపి సిబ్బంది కాగా ఒకరు పోలీస్ అని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర నుంచి విధులు ముగించుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. 37మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)సిబ్బంది, ఇద్దరు పోలీసులు పోలీస్‌బస్సులో ప్రయాణిస్తుండగా పహాల్గాంచందన్‌వారీ మధ్య బస్సు లోతైన నదీలోయలో పడిపోయిందన్నారు. ఇద్దరు ఐటిబిపి సిబ్బంది సంఘటన ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోయారని, అనంతరం తీవ్రగాయాలతో మరో ఐదుగురు మరణించారని పోలీస్ అధికారులు వివరించారు. గాయపడినవారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులను బిఎస్‌ఎఫ్ హెలికాప్టర్ ద్వారా శ్రీనగర్ తరలించి ప్రత్యేక వైద్యచికిత్స అందిస్తున్నామన్నారు. వీరంతా ఆగస్టు 11న అమర్‌నాథ్‌యాత్ర విధులను ముగించుకుని తిరిగి వస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39మంది ఉన్నారని ఐటిబిపి అధికార ప్రతినిధి తెలిపారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

7 Jawans Killed after bus falls into Valley in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News