- Advertisement -
న్యూఢిల్లీ : మనీబిల్లు సంబంధిత వ్యాజ్యాలపై ఏడుగురు సభ్యుల విస్తృత సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు అవుతుంది. ఈ విషయాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది.పార్లమెంట్‌లో మనీబిల్లు పరిధిలో ఆధార్ చట్టం ఇతర కీలక బిల్లుల ఆమోదం ఎంతమేరకు చెల్లుబాటు అవుతుందనే విషయాన్ని ఈ విస్తృత ధర్మాసనం విచారిస్తుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మనీలాండరింగ్ చట్టానికి సవరణలు ఇతర బిల్లులను రాజ్యసభలో మెజార్టీ లోపం నేపథ్యంలో దొడ్డిదారిన మనీబిల్లుగా నెగ్గించుకుందనే వివాదం రాజుకుంది. కీలక అంశాలకు సంబంధించి మనీబిల్లు పరిగణన వర్తిస్తుందా? అనేది ఈ ధర్మాసనం విచారిస్తుంది. ఈ నెల 12వ తేదీన ఏడుగురు సభ్యుల ధర్మాసనం పరిధిలో సంబంధిత పిటిషన్లు అన్ని విచారణకు వస్తాయని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది.
- Advertisement -