Friday, November 22, 2024

ఎఎంయుకు మైనారిటీ హోదా కల్పించవచ్చా?

- Advertisement -
- Advertisement -

ఏడుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ

న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు)కి మైనారిటీ ప్రతిపత్తికి సంబంధించిన వివాదంపై చీఫ్ ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ ప్రారంభించింది. ఎఎంయు మైనారిటీ సంస్థ కాదంటూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అప్పీలును ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ విచారణ సాగనున్నది. సిజెఐ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథన్ ఇతర సభ్యులు.

పార్లమెంటరీ చట్టంపై ఏర్పడిన విద్యా సంస్థకు రాజ్యాంగంలోని 30వ అధికరణ కింద మైనారిటీ ప్రతిపత్తిని కల్పించవచ్చా లేదా అన్న విష,ఁదన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుంది. ఈ అధికరణ కింద మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు తమ సొంత విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని నిర్వహించే అధికారం ఉంటుంది. 2019 ఫిబ్రవరి 12నఈ కేసు విచారణ సందదర్భంగా ఎఎంయుకు మైనారిటీ ప్రతిపత్తి అంశాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పటి సిజెఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నివేదించింది.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపిస్తున్నారు. ఎఎంయు మైనారిటీ విద్యా సంస్థ కాదంటూ అలహాబాద్ హైకోర్టు 2006లో ఇచ్చిన తీర్పులోని తప్పొప్పులను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనున్నది. కాగా..200లో టిఎంఎ పాయ్ కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మైనారిటీ సంస్థ ఏర్పాటుకు ఉండాల్సిన అర్హతల గురించి స్పష్టం చేయలేదని న్యాయవాది రాజజీవ్ ధావన్ ఇదివరకు వాదనల సంర్భంగా తెలిపారు. ఒకవేళ ఎఎంయును మైనారిటీ విద్యా సంస్థగా సుప్రీంకోర్టు ప్రకటించిన పక్షంలో ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు అడ్మిషన్లలో రిజర్వేషన్లు లభించవు.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవ్వనున్న తీర్పు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తిపై జరుగుతున్న న్యాయ పోరాటానికి మార్గదర్శనం చేయగలదు. 2011లో యుపిఎ ప్రభుత్వ హయాంలో జామియా మిలియా యూనివర్సిటీ మైనారిటీ సంస్థగా గుర్తింపు పొందింది. కాగా..ఎఎంయుపై 2006లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎఎంయు, అప్పటి యుపిఎ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. అయితే..తనకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న వైఖరి తప్పుగా భావిస్తున్నామని పేర్కొంటూ సుప్రీంకోర్టులో తన అప్పీలును 2016లో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

1968లో ఏర్పడిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అజీజ్ బాషా కేసులో ఎఎంయును కేంద్ర యూనివర్సిటీగా ప్రకటించిందే తప్ప మైనారిటీ సంస్థగా కాదని ఎన్‌డిఎ ప్రభుత్వం తెలిపింది. ఎఎంయును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందే తప్ప ముస్లింలు కాదని, అందుకే అది మైనారిటీ సంస్థ కాదని ప్రభుత్వం వాదించింది. 1968 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎఎంయు(సవరణ) చట్టం, 1972, తిరిగి 1981 (సవరణ)చట్టం అమలులోకి వచ్చాయి. 1981 నాటి చట్టం ద్వారా ఎఎంయుకు మైనారిటీ ప్రతిపత్తిని కల్పించగా దీన్నిఅలహాబాద్ హైకోర్టు తన 2006 జనవరి తీర్పులో కొట్టివేసింది.

గత యుపిఎ ప్రభుత్వం ఎఎంయుకు మైనారిటీ హోదా కల్పిస్తూ అందులోని వైద్య ఫ్యాకల్టీకి సంబంధించిన సీట్లలో 50 శాతం ముస్లింలను రిజర్వ్ చేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జారీచేసిన అన్ని లేఖలను ఉపసంహరించుకుంటున్నట్లు తన అఫిడవిట్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా చెప్పిన మాటలను ఎన్‌డిఎ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో ఉటంకించింది. ఎఎంయుకు మైనారిటీ ప్రతిపత్తి అంగీకరిస్తే ఇతర మతపరమైన, భాషాపరమైన మైనారిటీల నుంచి వచ్చే ఈ తరహా డిమాండ్లను తిరస్కరించలేమంటూ ఇందిరా గాంధీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News