Friday, December 20, 2024

కశ్మీర్ లో కొండపై నుంచి లోయలో పడిన రెండు కార్లు.. ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

7 Killed after 2 cars plunge into Stream in Kashmir

జమ్మూ: జమ్మూ కశ్మీరులోని దోడా జిల్లాలో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న రెండు కార్లు అదుపు తప్పి లోయలో ఉన్న వాగులో పడిపోవడంతో ఏడుగురు మరణించగా మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దోడా-భడేర్వా రోడ్డుపై 6 గంటల వ్యవధిలో ఈ రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఎస్‌ఎస్‌పి అబ్దుల్ ఖయూమ్ తెలిపారు. మృతులలో రెండు జంటలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గల్గంధర్ సమీపంలో ఒక కారు 400 అడుగుల లోతులో ఉన్న నీరు వాగులో పడిపోగా నలుగురు వ్యక్తులు మరణంచారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆ తర్వాత మరణించాడు. అంతకు కొద్ది గంటల ముందు , అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోని ముఘల్ మార్కెట్ వద్ద దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి వాగులోకి మరో కారు పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

7 Killed after 2 cars plunge into Stream in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News