Wednesday, January 22, 2025

ఇండోర్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

7 Killed After fire broke out in Indore

ఇండోర్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. శనివారం తెల్ల‌వారుజామున ఇండోర్‌లోని స్వ‌ర్ణ భాగ్ కాల‌నీలో ఉన్న రెండు అంత‌స్తుల భవనంలో షార్ట్ స‌ర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంలో ఏడు మంది మృతిచెందారు. పార్కింగ్ చే బైకులకు కూడా మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.

7 Killed After fire broke out in Indore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News