- Advertisement -
ఢాకా: బంగ్లాదేశ్‌లో ‘సిత్రాంగ్’ తుపాను భీభత్సం సృష్టించింది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భోలా జిల్లాలోని దౌలత్‌ఖాన్, నారియల్ జిల్లాలోని చర్ఫాషాన్‌లలో భారీ వర్షాలకు చెట్లు కూలి కు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది గాయపడ్డారు. నైరుతి బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలను తుపాను తాకే అవకాశం ఉండడంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, తుఫాను కేంద్రాలను ఏర్పాటు చేశారు. రానున్న మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలియజేయడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ‘సిత్రాంగ్’ తుపాను ప్రభావంతో భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
7 Killed after Sitrang Cyclone in Bangladesh
- Advertisement -