Monday, December 23, 2024

బావిలో వాహనం పడి ఏడుగురి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

7 Killed After SUV Falls Into Well in Madhya Pradesh

భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా, ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లా లోని మోఖెడా పోలీస్ స్టేషన్ పరిధి లోని కొడమాపు గ్రామంలో బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం బావి లోంచి ఏడు మృతదేహాలతోపాటు వాహనాన్ని పోలీసులు వెలికి తీశారు. భాజీపాని గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News