Wednesday, January 22, 2025

క‌ర్నాట‌క‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ధార్వాడ్‌: క‌ర్నాట‌క‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్వాడ్‌ జిల్లాలోని నిగాది గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మగ్గురు ఆస్తత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 10మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుబ్లీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా మ‌న్సూర్ గ్రామంలో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.

7 Killed after vehicle rams into tree in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News