Sunday, February 23, 2025

అకోలాలో చెట్టు విరిగిపడి ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -
26 మందికి గాయాలు

ముంబై: మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని ఓ గ్రామంలోని ఆలయ ఆవరణలోని షెడ్డుపై చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, 26 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం పరాస్ గ్రామంలోని బాబూజీ మహారాజ్ మందిరం వద్ద సాయంత్రం హారతి కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

భారీ వర్షంతో ఆ ప్రాంతం అతలాకుతలం అవడంతో ప్రజలు తడిసి ముద్దయిపోకుండా షెడ్డు కింద గుమిగూడారు. భారీ గాలుల కారణంగా వేపచెట్టు నేలకూలడంతో షెడ్డు కింద దాదాపు 50 మంది ఉండినట్లు సమాచారం.

Also Read: స్టాక్ మార్కెట్ లో నేడు 15 నిమిషాల్లో రూ. 400 కోట్ల లాభం!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతికి సంతాపం తెలుపుతూ లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అకోలా చెట్టు కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షలు, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News