Monday, December 23, 2024

బాణసంచా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఉన జిల్లాలోని తహ్లివల్‌ పారిశ్రామిక వాడలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపుచేసి సహాయక చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు స్వల్పంగా గాయపడగా.. మిగితా 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

7 killed in blast at fireworks factory in Himachal Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News