Thursday, January 23, 2025

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ : జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్, జమ్మూ, రియాసి జిల్లాల్లో సంభవించిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారని, వారిలో నలుగురు ఒకే కుటుంబ సభ్యులని అధికారులు వెల్లడించారు. ఉధమంపూర్ జిల్లాలో తమ కారును ఒక ట్రక్కు ఢీకొన్నప్పుడు ఒక జంట, వారి ఇద్దరు కుమార్తెలు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆ కుటుంబం జమ్మూ నుంచి కాశ్మీర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది. రియాసి జిల్లా మహోరె ప్రాంతంలో మంచుతో నిండిన బథోయిలో ఒక కారు

రోడ్డుపై నుంచి జారి ఒక లోయలో పడినప్పుడు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఐజాజ్ అహ్మద్, మహ్మద్ ఆసిఫ్ మరణించారని అధికారులు తెలిపారు. వారి మృతదేహాలను వెలికితీసి, వారి కుటుంబాలకు అప్పగించారు. జమ్మూలోని ఝజ్జర్ కోట్లి ప్రాంతంలో మన్వాల్ సమీపాన ఒక వంతెనపై నుంచి పాడి పశువులను రవాణా చేస్తున్న ఒక ట్రక్కు ఒక వంతెనపై నుంచి పడిపోయినప్పుడు ట్రక్కు డ్రైవర్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆ ట్రక్కులోని పాడి పశువులలో డజనుకు పైగా చనిపోయినట్లు అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News