Tuesday, December 24, 2024

ప్రాణం తీసిన అతివేగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శివ్వంపేట : అతివేగంగా కారు దూసుకొచ్చిన కారు వాగులో పడిపోయిన ఘటనలో ఏడుగురు వ్య క్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా, శివ్వంపేట మండలం లో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం పై స్థానికు లు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…. శివ్వంపేట మండలంలోని శంకర్‌తండా, సీతారాం తండా, తాళ్లపల్లి తండాకు చెం దిన వారు బుధవారం వర్గల్ మండలం, సీతారాం తండాలోని త మ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి చేరుకు నే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం త మ స్వగ్రామానికి సమీపంలో గల ఉసిరికపల్లి పరిధిలోని వారు ప్ర యాణిస్తున్న కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి వాగులో పడిపోయింది. అక్కడే పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొనడంతో కారులో డ్రైవర్ మినహా మిగతా వారంతా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాగులో పడిపోయి నుజ్జునుజ్జయిన కారును జెసిబి సహాయంతో వెలికితీశారు. కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీయగా దనావత్ శివరాం (55), దనవాత్ దుర్గమ్మ (45), మాలోత్ అనిత (30), మాలోత్ బిందు (14), మాలోత్ శ్రావణి (12), గూగులోత్ శాంతి (45) గూగులోత్ మమత (16)ను మృతులుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా గిరిజనులే కావడంతో ఆయా తండాల గిరిజనులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన కారు డ్రైవర్‌ను మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి తూప్రాన్ డిఎస్‌పి వెంకటరెడ్డి, శివ్వంపేట ఎస్‌ఐ మైపాల్ చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని డిఎస్‌పి వెంకట్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News