- Advertisement -
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న లారీ చెంగం వద్ద కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటనా స్థలలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -