Friday, January 10, 2025

బస్సును ఢీకొట్టిన టాటా సుమో… ఏడుగురు భక్తులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

తిరువన్నామలై: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి ఓ ప్రభుత్వ బస్సును టాటా సుమో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. టాటా సుమో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, అనంతరం మరో ఇద్దరు చనిపోయారు. టాటా సుమోలో ప్రయాణిస్తున్నవారు అన్నామలైయార్ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టాటా సుమో తిరువణ్ణామలై నుంచి బెంగళూరు వస్తోంది. ధర్మపురి నుంచ తిరువణ్ణామలై వైపు బస్సు వెళ్తోంది.

ఈ రెండు వాహనాలు అంతనూర్ వద్ద ఢీకొన్నాయి. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో కొందరు అస్సోంకు చెందిన వారని, వృత్తిరీత్యా బెంగళూరులో పనిచేస్తున్నారని పోలీస్‌లు తెలిపారు. టాటా సుమోలో మొత్తం 11మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. అస్సోంకు చెందిన పంచరాయ్, నారాయణన్, విమల్, సాల్, నిఖాల్, తమిళనాడుకు చెందిన కామరాజు, పునీత్‌కుమార్, ఈ ఘటనలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News