Sunday, December 22, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

లక్నో: యుపిలోని అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం బహ్రాయిచ్- లఖింపూర్ హైవేపై ఓ టూరిస్ట్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ తోపాటు ఐదుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కర్నాటక నుంచి 16మంది ప్రయాణికులతో అయోధ్య వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్న పేర్కొన్నారు.

7 killed in Road Accident in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News