Friday, November 15, 2024

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి..

- Advertisement -
- Advertisement -

7 Killed in Several Road Accidents in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు మృత్యువాత పడగా మరో పది మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం నాడు చోటుచేసుకున్న మూడు వరుస ప్రమాదాలలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధి దివీస్ ల్యాబ్ సమీపంలో ఆదివారం నాడు ఒకే స్థలంలో రెండు గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. మొదట ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టగా సాయిలు అనే వ్యక్తి మృతిచెందాడు. అతని కుమారుడు నగేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జరిగిన రెండు గంటలలోపే అదే స్థలంలో ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకుల తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని రసాయన కంపెనీలో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదిలావుండగా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజీగూడెం వద్ద మలుపు తిరుగుతున్న కారును ఆర్‌టిసి బస్సు ఢీ కొట్టిన ఘటనలో కారులో ఉన్న ఇద్దరు చందు, పృథ్వీరాజ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. ఆర్‌టిసి బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌కు చెందిన చందు(35), పృథ్వీరాజ్‌లు మృతి చెందినట్లు గుర్తించిన పోలీసులు కేసు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు.
నగరంలో ఇద్దరు మృతి:
హైదరాబాద్ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని కూకట్‌పల్లిలో శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తిని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓబుల్‌రెడ్డితో పాటు బైక్‌పై వెనక కూర్చున్న వహీద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు. ఇద్దరి మృతికి కారణమైన సదరు ద్విచక్ర వాహనదారుడు ప్రవీణ్‌పై పోలీసులు కేసునమోదు చేశారు. ప్రవీణ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
బైక్ రైడర్ల హల్‌చల్:
హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై బైక్ రైడర్లు హల్‌చల్ సృష్టించారు. పది బైక్‌లపై స్నేహితులంతా కలిసి రోడ్డుపై స్టంట్లు వేస్తూ శంషాబాద్ వైపు వెళుతున్న క్రమంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ పైకి రాగానే బైక్ రైడర్ మైఖెల్ డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో దాదాపు వంద మీటర్ల వరకు బైక్‌తో పాటు మొఖేల్ ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా దెబ్బ తినగా మైఖేల్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7 Killed in Several Road Accidents in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News