Saturday, November 23, 2024

ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్
పాత లాగిన్ నెంబర్లతో ఈనెల 30 నుంచి వెబ్‌సైట్‌లో దేహదారుఢ్య పరీక్షల అప్లికేషన్ సబ్మిట్ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఫిజికల్ టెస్టు పూర్తి చేసిన వారు మళ్లీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కానీ వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు చెప్పింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం మార్కుల కలిపిన అనంతరం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్-2 అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 8న ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల వరకూ ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు నియామక బోర్డు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News