Monday, December 23, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకుతో సహా ఏడుగురు వైద్య విద్యార్థుల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

7 medical students killed in road accident in Wardha

వార్ధా: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో వార్ధా జిల్లాలో వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వంతెన పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు వైద్య విద్యార్థులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను వార్ధా జిల్లాలోని సావంగి ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థలుగా పోలీసులు గుర్తించారు. కాగా, మృతి చెందిన వారిలో గోండ్యా జిల్లా తిరోరి నియోజకవర్గం ఎమ్మెల్యే విజయ్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలిపారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News