Monday, December 23, 2024

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

లుధియానాలో ఘోర సంఘటన

7 Members death in Punjab

లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో బుధవారం తెల్వారజామున ఒక గుడిసెకు నిప్పంటుకుని అందులో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయ్యారు. వీరంతో బీహార్ నుంచి ఇక్కడకు వలస వచ్చిన కూలీలని తెలుస్తోంది. టిబ్బా రోడ్డులోని మున్సిపల్ గార్బేజ్ డంప్ యార్డు సమీపంలో ఉన్న గుడిసెలో వారంతా నిద్రిస్తుండగా ఈ ఘోరం జరిగిందని ఎసిపి సురీందర్ సింగ్ తెలిపారు. మృతులలో ఒక రెండేళ్ల బాలుడు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ దుర్ఘటనలో ఒక జంట, వారి ఐదుగురు పిల్లలు మరణించినట్లు టిబ్బా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రణబీర్ సింగ్ తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తెలియరాలేదని ఆయన తెలిపారు. మృతులను బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా బోగోపూర్ గ్రామానికి చెందిన సురేష్ సాహ్ని(55), అతని భార్య రీనా దేవి(53), వారి కుమార్తెలు రాఖీ, మీనాక్షి, గీత, చందా, రెండేళ్ల బాలుడు సన్నీగా గుర్తించారు. ఈ నెల 30న తలపెట్టిన తన పెద్ద కుమార్తె పెళ్లి కోసం తన స్వగ్రామానికి వెళ్లాలని సురేష్ భావించినట్లు మృతుల కుటుంబ సన్నిహిత బంధువు రాంబాబు సాహ్ని తెలిపారు. బతుకుతెరువు కోసం 25 ఏళ్ల క్రితం సురేష్ బీహార్ నుంచి లుధియానా వచ్చినట్లు వారి పొరుగున నివసించే బిందేషి శర్మ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News