- Advertisement -
జ్యుడీషియల్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు. జుడిషియల్ అధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. శ్రీ సుధా, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, తుకారం జి, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవి దేవిలకు పదోన్నతి కల్పించారు. గతనెల 16న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ ఆమోదముద్ర వేశారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం సంతోషంగా ఉందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. కాగా రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -