Monday, December 23, 2024

అదృశ్యమైన కార్మికుల్లో ఏడుగురు అడవుల్లో లభ్యం

- Advertisement -
- Advertisement -

7 of 19 missing labourers found in forest in Arunachal Pradesh

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక రోడ్డు నిర్మాణ ప్రదేశం నుంచి అదృశ్యమైన 19 మంది కార్మికులలో ఏడుగురి ఆచూకీ ఒక అటవీ ప్రాంతంలో లభించినట్లు సీనియర్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. కురుంగ్ కుమే జిల్లాకు చెందిన దామన్‌లోని హురి గ్రామ సమీపంలోని అడవిలో ఏడుగురు కార్మికులు ఆదివారం రాత్రి లభించారని డిప్యుటీ కమిషనర్ నిఘీ బెంగియా తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందచేస్తున్నామని ఆయయన చెప్పారు. వారి ఆచూకీ లభించినట్లు వారి కుటుంబాలకు సమాచారం అందచేశామని, మిగిలిన 12 మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈద్ కోసం తమ ఇళ్లకు వెళ్లేందుకు సెలవు లభించకపోవడంతో జులై 5న భారత్-చైనా సరిహద్దుల్లో మారుమూల ఉన్న రోడ్డు నిర్మాణ ప్రదేశం నుంచి అస్సాంకు చెందిన ఈ కార్మికులంతా పరారయ్యారు. రెండు మూడు బృందాలుగా విడిపోయిన వీరంతా కాలినడకన అడవి మార్గంలో తమ ఇళ్లకు పయనమైనట్లు ఆ అధికారి చెప్పారు. అప్పటి నుంచి వారి ఆచూకీ లభించలేదు.

7 of 19 missing labourers found in forest in Arunachal Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News