Sunday, December 22, 2024

ట్రక్కు- సుమో ఢీ.. ఒకే కుటుంబం లో ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ససారం (బీహార్ : బీహార్ రోహ్‌తాస్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ససారం పట్టణం వద్ద శివసాగర్ ఏరియాలో రెండో జాతీయ రహదారి వద్ద రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న ట్రాయిలర్ ట్రక్కును సుమోటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఝార్ఖండ్ లోని రాజరప్ప ఆలయాన్ని సందర్శించి సుమోటోలో కుటుంబీకులు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

డ్రైవర్‌తోపాటు మరో 11 మంది సుమోటోలో ఉన్నారు. మితిమీరిన వేగంతో నడపడంతో సుమోటో అదుపుతప్పి ప్రమాదానికి దారి తీసిందని పోలీస్‌లు చెప్పారు. మృతులు కైమూరు జిల్లాకు చెందిన వారు. మృతులు రాజమతి దేవి (55), ఆమె కుమార్తె సోని కుమారి (35),ఆమె అల్లుడు అరవింద్ శర్మ (40), మనుమలు ఆదిత్యకుమార్ (8), రియాకుమారి (9), అరవింద్ మేనకోడలు తారాకుమారి (22) వీరు కాక చందని కుమారి (15)ని గుర్తించారు. గాయపడిన వారిని సమీపాన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News