Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు బైశాఖి భక్తులు మృతి..

- Advertisement -
- Advertisement -

హోషియార్‌పూర్: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లా మస్తాన్ ఖేరాకు చెందిన భక్తులు 17 మంది బైశాఖి వేడుకలు జరుపుకోడానికి కాలినడకన వీరు వెళ్తుండగా అదుపు తప్పి ఒక ట్రక్కు వీరిపైకి దూసుకురావడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది గాయపడ్డారు. వీరంతా ఖురల్‌గఢ్ సాహిబ్‌కు బైశాఖి వేడుకల కోసం వెళ్తుండగా గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.

Also Reed: పోలీస్ స్టేషన్‌లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్‌ఐ

కొండకు ఆనుకుని వాలుగా ఉన్న ప్రాంతంలో అటుగా వస్తున్న ట్రక్కుడ్రైవర్ పట్టు కోల్పోవడంతో ట్రక్కు దూసుకువచ్చిందని డీఎస్పీ తెలిపారు. మృతులు రాహుల్, సుదేశ్‌పాయ్, సంతోష్, అంగూరి, కుంతి, గీత, రమోగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్‌కు తరలించగా, మిగతా వారిని గఢ్ శంకర్ లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News