మార్కెట్లో బడ్జెట్ విభాగంలో సరసమైన 7 సీట్ల కార్లు వస్తున్నాయి. దీంతో కుటుంబ తరగతిలో వాటి డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు అందరూ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను కొనటం ఆపేసి ఈ చౌకైన 7 సీట్ల కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కార్ల కంపెనీలు ఇప్పుడు గతంలో కంటే ఈ విభాగంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించాయి. ఇప్పుడు మీరు కూడా మీ కుటుంబానికి సరసమైన ధరలో 7 సీట్ల కారు కొనబోతున్నట్లయితే, మారుతి ఈకో కారు మీకు ఉత్తమం అని చెప్పవచ్చు.
మారుతి ఈకో కారు 5, 7 సీట్లలో మార్కెట్లో లభిస్తుంది. ఈ కారు శక్తి విషయానికొస్తే.. ఇది 1.2L పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. మారుతి ఈకో 81 PS శక్తిని, 104 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది CNG ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. మారుతి ఈకో కారు పెట్రోల్ మోడ్‌లో 20 కి.మీ/లీటర్ మైలేజీని అందిస్తుంది. మరోవైపు.. ఈ కారు CNG మోడ్‌లో 27 కి.మీ/కీ.మీ మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం..మారుతి ఈకోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, చైల్డ్ లాక్, స్లైడింగ్ డోర్లు, డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ప్రత్యేక లక్షణాలు ఇందులో ఉన్నాయి. కాగా, ఈకో ధర రూ. 5.44 లక్షల నుండి ప్రారంభమవుతుంది.