Monday, January 20, 2025

5 శాతం రిజర్వేషన్

- Advertisement -
- Advertisement -
రామగుండం మెడికల్ కాలేజీ సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సిఎం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆస్పత్రిలో 50 పడకలు ఉద్యోగులకే.. ట్విట్టర్
వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ పేరును సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)గా మార్చడంతో పాటు, ఉద్యోగుల పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజిలో మొత్తం 150 ఎంబిబిఎస్ సీట్ల ఉండగా, 23 సీట్లు ఆలిండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 ఎంబిబిఎస్ సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్‌సి,ఎస్‌టి,బిసి రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల పిల్ల లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వి ట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయించామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News