Thursday, December 26, 2024

7 బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు.. అభ్యర్థులు ఎవరంటే?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రానున్న శాసనసభ ఎన్నికల్లో ఏడు బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. సోమవారం తెలంగాణ భవన్ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొన్ని కారణాలు వల్ల ఉప్పల్, వేములవాడ, వైరా, కోరుట్ల, ఖానాపూర్, స్టేషన్ ఘన్ పూర్, అసిఫాబాద్ శాసన సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.

కాగా, ఈ సారి ఉప్పల్ నుంచి బండారు లక్ష్మా రెడ్డి, వేములవాడ నుంచి చల్మెడ లక్ష్మినరసింహారావు, ఖానాపూర్ నుంచి భూక్యా జాన్సన్ నాయక్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి, వైరా నుంచి మదన్ లాల్, కోరుట్ల నుంచి కల్వకుంట్ల సంజయ్ లు పోటి చేయనున్నారు. ఇక, గజ్వేల్ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి నుంచి కూడా సిఎం కెసిఆర్ పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News