- Advertisement -
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమేంగ్ జిల్లాలో హిమపాతంలో గల్లంతైన సైనిక గస్తీ బృందంలోని ఏడుగురి మృతదేహాలు లభించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. భారీ స్థాయిలో మంచు కురుస్తుండడంతో సైనిక గస్తీ బృందం ఆదివారం గల్లంతు కాగా సైన్యం సహాయక, గాలింపు చర్యలు చేపట్టింది. ఏడుగురు సైనిక సిబ్బంది మృతదేహాలు లభించినట్లు అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వత ప్రాంతంలో గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో మంచు కురుస్తున్నట్లు అధికారులు చెప్పారు. సైనికుల మృతదేహాలను సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వారు తెలిపారు.
7 Soldiers died after hit by Avalanche in Arunachal
- Advertisement -