Monday, January 20, 2025

ఏడుగురు విద్యార్థులకు హాస్టల్ నుంచి బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

కాలేజీ ఆవరణలో బీఫ్ (గొడ్డు మాంసం) వండారన్న కారణంపై కాలేజీ హాస్టల్ నుంచి ఏడుగురు విద్యార్థులను బహిష్కరించారు. ఒడిశా లోని బరంపురం ప్రభుత్వ పరాల మహరాజా ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వేరే వర్గం విద్యార్థులు ఈ సంఘటన గురించి కాలేజీ డీన్‌కు ఫిర్యాదు చేయడంతో కాలేజీ నిర్వాహకులు సంబంధిత విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించారు.

దీంతో కాలేజీ ఆవరణలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పాలక వర్గాలు కాలేజీ దగ్గర భద్రతా బలగాలను నియమించారు. ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి వివరించారు. హాస్టల్ నుంచి బహిష్కరించడమే కాకుండా ఆ విద్యార్థుల్లో ఒకరికి రూ. 2000 వరకు జరిమానా విధించినట్టు చెప్పారు. హాస్టల్ నిబంధనలను ఉల్లంఘించినందున సంబంధిత విద్యార్థులపై చర్యలు తీసుకుని హాస్టల్ నుంచి బహిష్కరించినట్టు కాలేజీ డీన్ ఈనెల 12 న ఒక ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News