Thursday, December 12, 2024

సారంగాపూర్ కెజిబివిలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంలోని కసూర్బా గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది వారిని వెంటనే వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం వారిని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చలిని తట్టుకోలేక ఆ విద్యార్థినులు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడ్డారని, వైద్య చికిత్స తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులతో పాటు గురుకుల పాఠశాల అధికారులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News