Thursday, January 23, 2025

ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై 7 వాహనాలు ఢీ..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై గురువారం ఏడు వాహనాలు ఒకదానితో మరోటి ఢీకొన్నాయి. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ట్రక్కు మొత్తం 12 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైవేఫై ఖోపోలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ధ్వంసమయిన వాహనాల్లో కార్లతో పాటుగా ట్రక్కులు కూడా ఉన్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నెల ప్రారంభంలో ఇదే హైవేపై ఆగిఉన్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News