Sunday, January 19, 2025

బీదర్‌లో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మహిళల మృతి

- Advertisement -
- Advertisement -

బీదర్ : కర్ణాటకలోని బీదర్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందగా, 11 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బెమల్‌ఖేడా గ్రామంలో బాధితులతో వెళ్తున్న ఆటో, ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను పార్వతి (40), ప్రభావతి (36), గుండమ్మ (60), యాదమ్మ (40), జగ్గమ్మ (34), ఈశ్వరమ్మ (55), రుక్మిణి బాయి (60)గా గుర్తించారు. ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు వాహనాల డ్రైవర్లతో సహా గాయపడిన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News