కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై మీమ్స్ పోస్ట్ చేసిన ఏడుగురు యూట్యూబర్లపై కోల్‌కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు. మమతా బెనర్జీ ప్రసంగాల ఆధారంగా అభ్యంతరకరమైన మీమ్స్‌ను పోస్ట్ చేశారంటూ సాగర్‌దాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టిక్‌టాకర్ ప్రచితా, టోటల్ ఫన్ బంగ్లా, రియా ప్రియా, సాగరికా బర్మన్ వ్లాగ్స్, లైఫ్ లైన్ ఇన్ దుర్గాపూర్, ఫ్రెండ్స్ క్యాంపస్, పూజాదాస్ 98 వంటి పేర్లను అతడు ప్రసావించాడు. మమతాబెనర్జీ ప్రసంగం నుంచి తీసుకొన్న కొన్ని భాగాలను మీమ్స్‌లో వాడారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ అభ్యంతరకరమైన మీమ్స్ కారణంగా ఘర్షణలు చెలరేగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆరోపించాడు. నిందితులు వ్యక్తిగత సంపాదన కోసమే మీమ్స్‌ను తయారు చేశారన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
మమతా బెనర్జీపై మీమ్స్ పోస్టు చేసిన యూట్యూబర్లపై కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -