Monday, December 23, 2024

ఎపి స్కిల్ డెవలప్ మెంట్‌లో రూ. 70 కోట్లు దారి మళ్లినట్టు గుర్తించిన ఇడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో 70 కోట్ల నిధులు దారి మళ్లాయని ఇడి తెలిపింది. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మెటీరియల్, సర్వీసెస్ సప్లై పేరుతో ఈ నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్‌కు, అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని చెప్పింది.

సీమెన్స్ ప్రాజెక్ట్ కు ఇవ్వాల్సిన నిధులను తరలించారని తెలిపింది. ఈ కేసులో సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా మాజీ ఫైనాన్సియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టర్డ్ అకౌంటెంట్ సురేశ్ గోయల్ లను మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేశామని తెలిపింది. వీరిని విశాఖపట్నంలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఏడు రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగించింది. ఎపి సిఐడి నమోదు చేసిన ఎప్‌ఐఆర్ ఆధారంగా ఇడి విచారణ చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News