Wednesday, January 22, 2025

తెలంగాణలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 70 శాతం మందికి రక్తహీనత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పార్లమెంటులో ‘అనీమియా ముక్త్ భారత్’(ఎఎంబి) కార్యక్రమానికి సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఓ నివేదికను ప్రవేశపెట్టింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే4, సర్వే5 ప్రకారం రక్తహీనత పిల్లలు 60.7 శాతం నుంచి 70 శాతానికి పెరిగారు. రెండేళ్ల క్రితమే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే5 విడుదలచేశారు. రక్తహీనతతో బాధపడుతున్న ఇతర రాష్ట్రాల పిల్లల్లో గుజరాత్‌లో 79.7 శాతం, పంజాబ్‌లో 71 శాతం, రాజస్థాన్‌లో 71 శాతం ఉన్నారు.

తెలంగాణ మహిళల్లో రక్తహీనత ఎక్కువ ఉందని, 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల్లో 57.6 శాతం ఉందని, అదే 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతుల్లో 64.7 శాతం ఉందని, గర్భిణీ మహిళల్లో 53.2 శాతం ఉంటోందని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో నివేదికను సమర్పించారు. తినే పదార్థాల్లో వైవిధ్యం లేకపోవడం, ఎక్కువగా టీ/కాఫీలు సేవించడం, జంక్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల రక్తహీనత సమస్యలు ఏర్పడుతున్నాయని డాక్టర్ కిరణ్ మాదాల తెలిపారు.

Anemia kids

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News